యాసంగి యాతన

ABN , First Publish Date - 2021-11-28T05:42:48+05:30 IST

యాసంగి యాతన

యాసంగి యాతన

వరి వద్దంటున్న  ప్రభుత్వం

అయోమయంలో రైతులు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్న సర్కారు

అవగాహన కల్పించని అధికారులు

జలాశయాల్లో ఫుల్లుగా నీరు

నీటి జాలు భూముల్లో ఆరుతడి పంటలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున అన్నదాతలు

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. యాసంగిలో వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం రైతులను కలవరపరుస్తోంది. వరి సాగుపై ఆధారపడిన వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగుపై చా లా మంది రైతులు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం ముందుకు రావడం లేదు. దీం తో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఏయే పంటలు వేస్తే ప్రయోజనకరమో తెలియక వారు సత మతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, లాభా ల గురించి రైతులకు అవగాహన కల్పించే వారు కరువ య్యారు. వరి సాగు వద్దని ప్రచారం చేయడం తప్ప, ప్రత్యామ్నాయ పంటల వల్ల ప్రయోజనాలేమిటో అధి కార యంత్రాంగం స్పష్టంగా చెప్పడం లేదని అన్నదా తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో యాసంగిలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యా మ్నాయ పంటలపై కొందరు దృష్టిపెట్టగా మరికొందరు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వానా కాలంలో సాగు చేసిన వరి పంట ప్రస్తు తం చేతికి వస్తోంది. ధాన్యం అమ్ము కునేందుకు ప్రభుత్వం ఇంకా వెసులుబా టు కల్పించలేదు. పూర్తిస్థాయిలో  కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించుకోలేక కల్లాల వద్దే కుప్పలు పోసి జాగారం చేస్తు న్నారు. అక్టోబరు రెండో వారంలోనే కొనుగో లు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పినా రెండు జిల్లాల్లోని అన్ని మండలాల్లో కొనుగోళ్లు పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవటంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే యాసంగి కష్టాలు మరింత క్లిష్టంగా ఉండొచ్చని రైతు లు ఆందోళన చెందుతున్నారు.

వరి సాగుకు పుష్కలంగా నీళ్లు

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరి సాగుకు భూ ములు అనుకూలంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీలోకి భారీగా వరద వస్తోంది.  దీంతో రెండు జిల్లాల్లో చాలా వరకు కుంటలు, చెరువుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా భూపా లపల్లి జిల్లాలోని భీంగణపురం, గణపసముద్రం చెరు వులతో పాటు మోరంచవాగు కింద కూడా వరి సాగు కు నీటి లభ్యత ఉంది. అలాగే ములుగు జిల్లాలో వెం కటాపురం మండలం పాలెం ప్రాజెక్టు, గోవిందరా వుపేట మండలం లక్నవరం, వెంకటాపూర్‌ మండలం రామప్ప, మంగపేట మండలం మల్లూరు ప్రాజెక్టుల కింద వరి సాగు చేసేందుకు అనువుగా ఉంది. ఈ జలా శయాల్లో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. కొన్నేళ్లుగా వరి తప్ప వేరే పంటలు ఈ ప్రాజెక్టుల కింద సాగు చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వరి సాగు చేయొద్దని సూచిస్తుండటంతో ప్రాజెక్టుల కింద ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల భూముల్లో ఏ పంటలు సాగు చేయాలో దిక్కతోచని స్థితుల్లో రైతులు కొట్టుమి ట్టాడుతున్నారు. వీటితో పాటు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల కింద నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కాళే శ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ద్వారా భారీగా నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి చెరుతున్నాయి. అలాగే భూ గర్భ జలాలు కూడా భారీగా పెరిగి బోరు బావులు, వ్యవసాయ బావుల్లోకి నీళ్లు దూకి వస్తున్నాయి. నీటి సౌకర్యం పుష్కలంగా ఉండటంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. రెండు జిల్లాల్లో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వ ప్రక టనతో రైతులు ఆయో మయంలో పడిపోయారు. వరి సాగు చేసిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఎలా పండుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ సూచిస్తున్న ఏ అరుతడి పంట కూడా పొలాల్లో పండించలేమని రైౖతులు పేర్కొంటున్నారు. పొలాలన్నీ జాలు పట్టి ఉన్న సమయంలో వరి తప్ప వేరే పంటను  సాగు చేయలేమని అంటున్నారు. రెండు జిల్లాల్లో కూడా నీటి సౌకర్యం పుష్కలంగా ఉండ టంతో వరి సాగుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

ప్రత్యామ్నాయంపై అవగాహన ఏదీ..?

యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలో రైతు లకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎందుకు ముందుకు రావటం లేదనే విమర్శలు వస్తున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా వేసే పంటల కు విత్తనాలు, సబ్సిడీలతో పాటు వాటిని అమ్ముకు నేందుకు మార్కెంటింగ్‌ సౌకర్యాలు, గిట్టుబాటు, లాభాలపై కనీసం ప్రచారం కూడా చేయడం లేదని తెలుస్తోంది.   అవగాహన లేకుండా పంటలు ఎలా వేసుకోవాలంటూ రైతులు ముందుకు రావడం లేదు.  చాలా మంది కౌలు రైతులు కూడా యాసంగిలో  ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపడం లేదు.  ఇప్పటికైనా ప్రభుత్వం రైౖతులకు నచ్చిన పంటను సాగు చేసుకునేలా ప్రొత్సహించాలని, ప్రత్యామ్నాయ పంటలపై, విత్తనాలు, మార్కెటింగ్‌పైన అవగాహన కల్పించాలని  రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-11-28T05:42:48+05:30 IST