నేటి నుంచి ఖరీఫ్‌ ఆరంభం

ABN , First Publish Date - 2020-06-01T09:57:53+05:30 IST

అన్నదాతల ఆశల సీజన్‌ ఖరీఫ్‌ వచ్చేసింది. సోమవారం నుంచి సీజన్‌ ఆరంభం కానుంది.

నేటి నుంచి ఖరీఫ్‌ ఆరంభం

నాలుగు రోజుల్లో అనంతకు నైరుతి రుతుపవనాలు 

పదును వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపు 

మరో సారి వర్షం పడితే విత్తుకు రెడీ

 

అనంతపురం వ్యవసాయం, మే 31 : అన్నదాతల ఆశల సీజన్‌ ఖరీఫ్‌ వచ్చేసింది. సోమవారం నుంచి సీజన్‌  ఆరంభం కానుంది. ప్రతి ఏడాది జూన్‌ 1 నుంచి సీజన్‌ ప్రారంభమై సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగుస్తుంది. ఖరీఫ్‌లో జిల్లాలోని  మెట్ట భూముల్లో వర్షాధారం కింద ప్రధానంగా వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 6.83 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా వేరుశనగ 4.60 లక్షల హెక్టార్లు, కంది 53వేల హెక్టార్లు మిగిలిన విస్తీర్ణం లో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, ప్రొద్దు తిరు గుడు,  ఆముదం, ఉలవలు, పెసలు, అలసంద తదితర రకాలు ప్రత్యామ్నాయ పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది జిల్లాలో ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం  ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది.  

 

పలు ప్రాంతాల్లో దుక్కులు  

ఈ సారి తొలకరి వర్షాలు ఆశించిన స్థాయిలో పలుక రించలేదు. సాధారంగా మే నెలలో తొలకరి వర్షాలు బాగా పడితే వేసవి దుక్కులు చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. దుక్కులు చేసుకున్న తర్వాత వర్షం పడితే నేరుగా విత్తనం వేసుకునేందుకు అనుకూలం. ఈ సారి గత నెల లో పలు ప్రాంతాల్లో పడిన వర్షాలకు అక్కడక్కడా దుక్కు లు చేసుకున్నారు. దుక్కులు చేసుకున్న ప్రాంతాల్లో మరో మారు వర్షం పడితే విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు వేరుశనగ  విత్తుకునేందుకు అదును సమయంగా వ్యవసాయశాస్త్రవే త్తలు చెబుతున్నారు. ఆ సమయంలో విత్తనం వేసుకుంటే దిగుబడులు బాగుంటాయని స్పష్టం చేస్తున్నారు. 


నాలుగు రోజుల్లో అనంతకు నైరుతి రుతుపవనాలు 

ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాల కోసం అన్నదాతలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రానున్న నాలుగు రోజుల్లో  నైరుతి రుతుపవనాలు రోజుల్లో జిల్లాలోకి ప్రవేశించే అవ కాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సమృ ద్ధిగా వర్షాలుపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబు తున్నారు. సోమవారం అధికారికంగా వివరాలు వెల్లడించ నున్నారు. ఈ ఏడాదైనా సకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిపించి ఆదుకోవాలని వరుణ దేవున్ని అన్నదాతలు ప్రార్థిస్తున్నారు. 


వర్షం పడితే విత్తుకు రెడీ..! 

ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో వర్షాలు పడితే విత్తనం వేసేందుకు కరువు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇదివరకు దుక్కులు పూర్తైన ప్రాంతాల్లో మరో సారి వర్షం పడితే ముందస్తుగా విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉ న్నారు. ఈ ఏడాది జిల్లాకు 3.34 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయంచారు. రైతుభరోసా కేంద్రాల్లో గ్రామ స్థాయిలోనే విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినా ఇప్పటి  దాకా ఆశించిన స్థాయిలో విత్తన పంపిణీ చేయ లేకపోయారు. జిల్లావ్యాప్తంగా 3.27 లక్షల మంది రైతులు విత్తన వేరుశనగ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటి దాకా 2.81 లక్షల మంది 2.59 లక్షల క్వింటాళ్ల కోసం నాన్‌సబ్సిడీ మొత్తాన్ని చెల్లించారు. ఇందులో 2.55 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు పంపిణీ చేశారు.


గ్రామ పంచాయతీ స్థాయికి కేటాయించిన  మేరకు సకాలంలో విత్తన వేరుశనగ బస్తాలు పంపడంలో జాప్యం చేస్తూ వచ్చారు. విత్తన కాయలు రాకపోవడంతో రైతులు డబ్బు లు కట్టేందుకు పలు ప్రాంతాల్లో వెనుకంజ వేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. రైతులు డబ్బులు కట్టినతర్వాతనే సరుకు పంపుతుండటం సమస్యగా మారుతోందన్న వా దనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంతర పంటల విత్త నాల పంపిణీ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ ఏడాది కేవ లం కంది, రాగి, కొర్ర, ఊదలు, సామలు, అరికలు, అండు కొర్రలు మాత్రమే కేటాయించారు. కనీసం ఆయా విత్త నాలు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు అయో మయంలో పడ్డారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో విత్తన కాయలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

Updated Date - 2020-06-01T09:57:53+05:30 IST