May 17 2021 @ 01:24AM

థియేటర్లలోనే ఖిలాడి

రవితేజ కథానాయకుడిగా నిర్మిస్తున్న ‘ఖిలాడి’ ఓటీటీ వేదికలో విడుదల కానుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని చిత్రనిర్మాత కోనేరు సత్యనారాయణ ఖండించారు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమనీ, థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘చిత్రకథ, కథనం, సాంకేతిక విలువలు అద్భుతంగా ఉంటాయి. థియేట్రికల్‌ అనుభూతి కోసమే సినిమా తీస్తున్నాం. థియేటర్లలోనే విడుదల చేస్తాం. దర్శకుడు రమేశ్‌వర్మ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటలీలో తీసిన యాక్షన్‌ సీన్లు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి. డింపుల్‌ హయతి కథానాయికలు.