Jul 23 2021 @ 12:58PM

'ఖుదా హాఫిజ్‌ 2' ప్రారంభం

గత ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఖుదా హాఫిజ్‌' సీక్వెల్ మూవీ తాజాగా ప్రారంభమయింది. మొదటి భాగంలో నటించిన విద్యుత్‌ జమ్వాల్‌ 'ఖుదా హాఫిజ్‌2:అగ్ని పరీక్ష' లోనూ నటిస్తుండగా, ఫరూక్‌ అలీ దర్శకత్వం  వహిస్తున్నారు. శివలేఖ ఒబెరాయ్‌ హీరోయిన్‌గా.. అను కపూర్, శివ పండిట్, నవాబ్‌ షా, విపిన్‌ శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హీరో విద్యుత్‌ జమ్వాల్‌తో పాటు ముఖ్య పాత్రలు పోషిస్తున్న తారాగణం పాల్గొంటున్నట్టు సమాచారం. కాగా ఇటీవలే తెలుగు డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి తెరకెక్కనున్న 'ఐబీ 71' చిత్రంలో విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.