Jun 15 2021 @ 20:41PM

కియారా ఇచ్చిన కిక్‌కి.. ఎగిరిపడింది

కియారా అద్వానీ.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన పేరు. మహేష్‌ బాబు సరసన 'భరత్‌ అనే నేను', రామ్‌ చరణ్‌ సరసన 'వినయ విధేయ రామా' చిత్రాలలో నటించిన కియారా.. ఇప్పుడు బాలీవుడ్‌లో క్షణం తీరిక లేని హీరోయిన్‌గా బిజీబిజీగా గడుపుతోంది. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించిన కియారా.. టాలీవుడ్‌లో అవకాశం వచ్చినా.. ఇటువైపు తిరిగి చూడలేనంతగా స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. అయినా.. మంచి అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్‌లో సినిమా చేస్తానని తెలిపింది. ఇక తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఆమె ఇచ్చిన కిక్‌కి.. ఎదుటి మనిషి తలపై ఉన్న టోపీ ఎగిరిపడింది. ఈ సన్నివేశం చూస్తేనే కిక్కొస్తుంది. తను నేర్చుకుంటున్న కిక్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌లో భాగంగా.. తన కోచ్‌ తలపై ఉన్న టోపీని బ్యాక్‌ మూమెంట్‌తో తన్నేసింది. ఆ టోపీ గింగిరాలు తిరుగుతూ భూమిపై పడిపోయింది. ఈ వీడియో షేర్‌ చేసిన కియారా.. 'ఏడాదిన్న‌ర త‌ర్వాత నా కిక్స్ పై న‌మ్మ‌క‌ముంచిన లలిత్‌కు హ్యాట్సాఫ్' అని తెలిపింది.