అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్

ABN , First Publish Date - 2021-06-12T01:53:52+05:30 IST

అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విజయవాడ కోర్టులో జాతీయ

అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్

అమరావతి: అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విజయవాడ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు కళావతి అలియాస్ భవానీపై ఛార్జ్‌షీట్ వేశారు. కిడారి సర్వేశ్వరరావును 40 మంది హత్య చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. కిడారి హత్యలో కళావతి కీలక పాత్ర పోషించారని ఎన్ఐఏ చెబుతోంది.


2018లో కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 9 మంది మావోయిస్టులపై ఎన్‌‌‌‌‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌‌లో కళావతితో పాటు మొత్తం 40 మందిని పేర్లను ఎన్‌ఐఏ పేర్కొంది.

Updated Date - 2021-06-12T01:53:52+05:30 IST