Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 9 2021 @ 11:13AM

క్రషర్‌ కంపెనీ యజమాని కిడ్నాప్‌, హత్య

అడయార్‌(చెన్నై): సేలం జిల్లాలో డబ్బు కోసం క్వారీ యజమానిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్‌ జిల్లా అరవకురిచ్చి సమీపంలో స్వామినాథన్‌ (55) క్వారీ క్రషర్‌ (కంకర తయారీ) కంపెనీ నడుపుతున్నారు. ఈయన వద్ద డ్రైవర్లుగా అదే ప్రాంతానికి చెందిన విజయ్‌ (25), నవీన్‌ (21) పనిచేస్తున్నారు. అయితే, స్వామినాథన్‌ డబ్బు లావాదేవీలు అధికంగా చేస్తుండడంతో ఆయన్ను కిడ్నాప్‌ చేసి భారీ మొత్తంలో డబ్బు గుంజాలని ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక పని నిమిత్తం లారీలో వెళ్ళాలని డ్రైవర్లకు చెప్పారు. దీన్ని ఆ ఇద్దరు తమకు అనుకూలంగా మార్చుకుని, లారీలో స్వామినాథన్‌ను ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేయడంతో అవాక్కైన స్వామినాథన్‌ పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు స్వామినాథన్‌ కోసం గాలించగా, మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలైవాసల్‌ అనే ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపివున్న లారీని తనిఖీ చేయగా, అందులో స్వామినాథన్‌ మృతదేహాన్ని గుర్తించారు. విజయ్‌, నవీన్‌ తప్పించుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోగా పోలీసులు వారి ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు.  

Advertisement
Advertisement