చేతిమీద 911 అని రాసుకుని.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

ABN , First Publish Date - 2020-10-07T08:33:51+05:30 IST

అమెరికాకు చెందిన ఓ మహిళ తన చేతిపై 911 అని రాసుకుని నిర్బంధం నుంచి బయటపడగలిగింది.

చేతిమీద 911 అని రాసుకుని.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

సాల్ట్ లేక్ సిటి, ఊతా: అమెరికాలో ఓ మహిళ తన చేతిపై 911 అని రాసుకుని నిర్బంధం నుంచి బయటపడగలిగింది. వివరంగా చెప్పాలంటే.. ఊతా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో నివాసముంటోంది. గత గురువారం అర్థరాత్రి గ్రాంట్ నీల్సన్(45) అనే వ్యక్తి తన దగ్గరున్న తాళంతో అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలిని తన గదిలోనే నిర్బంధించేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ఇంటి మొత్తాన్ని తగలబెడతానని కూడా బెదిరించాడు. మరుసటి రోజు ఇంటి ఫ్రంట్ డోర్ లాక్‌ను మార్చేందుకు తాళాలు బాగుచేసే వ్యక్తి వచ్చాడు. 


ఇదే సమయంలో బాధితురాలు నిందితుడికి తెలియకుండా తన చేతిపై 911 అని రాసుకుని తాళాలు బాగుచేసే వ్యక్తికి కనిపించేలా చూపించింది. అమెరికాలో ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎమర్జెన్సీ సమయంలో 911కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఇక మహిళ 911 అని చూపించడంతో.. తాళాలు బాగుచేసే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు. నిందితుడిపై పలు కేసులు పెట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-10-07T08:33:51+05:30 IST