Abn logo
Mar 30 2021 @ 19:33PM

కిడ్నాపర్ అరెస్ట్

పశ్చిమ గోదావరి: అభం శుభం తెలియని బాలికను కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెల్వమ్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. తమిళనాడులో ఓ బాలిక(9)ను సెల్వమ్ కిడ్నాప్ చేశాడు. అక్కడి పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఆ బాలికను ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి తీసుకువచ్చాడు. తాను కిడ్నాప్ చేసిన బాలికతో తణుకు పట్టణంలో భిక్షాటన చేయిస్తున్నాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  కిడ్నాపర్ సెల్వమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.