జీర్ణశక్తిని పెంచే కిడ్నీ బీన్స్‌!

ABN , First Publish Date - 2021-09-13T05:33:22+05:30 IST

కిడ్నీ బీన్స్‌లో పోషకాలు పుష్కలం. వీటిని రాజ్మా అని కూడా పిలుస్తారు. జీర్ణశక్తిని పెంచడంతో పాటు, బరువు తగ్గడంలోనూ ఈ బీన్స్‌ సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇంకా ఏం ప్రయోజనాలు చేకూరుతాయంటే...

జీర్ణశక్తిని పెంచే కిడ్నీ బీన్స్‌!

కిడ్నీ బీన్స్‌లో పోషకాలు పుష్కలం. వీటిని రాజ్మా అని కూడా పిలుస్తారు. జీర్ణశక్తిని పెంచడంతో పాటు, బరువు తగ్గడంలోనూ ఈ బీన్స్‌ సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇంకా ఏం ప్రయోజనాలు చేకూరుతాయంటే...



  1. వందగ్రాముల ఉడికించిన కిడ్నీ బీన్స్‌లో క్యాలరీలు - 127, ప్రొటీన్లు - 8.7 గ్రాములు, కార్బోహైడ్రేట్లు - 22.8 గ్రాములు, ఫైబర్‌ - 6.4 గ్రాములు లభిస్తాయి. 
  2. వీటిలో ఫైబర్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే గ్యాస్‌ సమస్య వచ్చే అవకాశం ఉంది. 
  3. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా మంచివే. వీటిలో స్లో రిలీజ్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తాయి. దీనివల్ల రక్తంలోకి షుగర్‌ నెమ్మదిగా విడుదల అవుతుంది. కిడ్నీబీన్స్‌ తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉంటాయి. అందుకే డయాబెటి్‌సతో బాధపడుతున్న వారు తీసుకోదగిన ఆహారం అని చెబుతారు.
  4. కిడ్నీబీన్స్‌లో ముఖ్యమైన మినరల్స్‌ అధిక శాతంలో ఉంటాయి. రక్తంను వృద్ధి చేసే ఐరన్‌, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఉపయోగపడే ఫాస్ఫరస్‌, నరాల వ్యవస్థను కాపాడే కె-విటమిన్‌ వంటివి వీటిలో పుష్కలం.
  5. కరిగే పీచుపదార్థాలు కూడా వీటిలో ఎక్కువ. ఈ ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గేందుకు సహాయపడుతుంది. 
  6. వెయిట్‌ మేనేజ్‌మెంట్‌లో రెసిస్టెంట్‌ స్టార్చ్‌ పాత్ర కీలకం. ఇది కిడ్నీ బీన్స్‌లో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉంటే ప్రొటీన్లు, ఫైబర్‌ సంతృప్తి భావనను ప్రేరేపించడంలో సహాయపడతాయి. ఫలితంగా ఆహారం తక్కువ తీసుకుంటారు.

Updated Date - 2021-09-13T05:33:22+05:30 IST