Abn logo
Sep 19 2021 @ 01:16AM

తొలిసారి సవేరాలో కిడ్నీ మార్పిడి

కిడ్నీ మార్పిడి గురించి వివరిస్తున్న సవేరా వైద్యులు డాక్టర్‌ బద్రీనాథ్‌, డాక్టర్‌ దుర్గాప్రసాద్‌


అనంతపురం వైద్యం, సెప్టెంబరు18: కరువు జిల్లాలో కిమ్స్‌ సవేరా ఆస్పత్రిలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన విజయవంతం చేశారు. ఇందు కు సంబంధించిన వివరాలను శనివారం సవేరా వైద్యు లు ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ రీనల్‌ ట్రాన్సప్లాంట్‌ ఫిజీషి యన డాక్టర్‌ భధ్రీనాథ్‌, న్యూరాలజిస్ట్‌ ట్రాన్సప్లాంట్‌ స ర్జన డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ వెల్లడించారు. రాయదుర్గంకు చెందిన బోయ వీరభద్ర ఆరు నెలల క్రితం వాంతులు, కాళ్లవాపులు ఇతర లక్షణాలతో సవేరా ఆస్పత్రికి వచ్చా రన్నారు. వైద్య పరీక్షల్లో వీరభద్ర మూత్ర పిండాలు బా గా పాడైనట్లు గుర్తించి ముందుగా ఆరోగ్యశ్రీ ద్వారా డ యాలసిస్‌ చేస్తూ వచ్చామన్నారు. ఆ సమయంలో బా ధితుడి చెల్లెలు తన మూత్ర పిండం దానం చేయడానికి ముందుకొచ్చిందన్నారు. నిబంధనల మేరకు పోలీస్‌, రె వెన్యూ, న్యాయ శాఖలతో పాటు ఆథరైజేషన కమిటీ నుంచి అనుమతులు తీసుకున్నామన్నారు. ఆ తర్వాత కి డ్నీ మార్పిడి కోసం డాక్టర్‌ ఉమామహేశ్వరరావు నేతృ త్వంలో ఈ నెల 5వ తేదీన సవేరా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశామన్నారు. ఈ చికిత్స విజయవంతం కావ డంతో బాధితుడికి ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఒక వ్యక్తి నుంచి కిడ్నీ తీసి మరో వ్యక్తికి అమర్చడం చాలా నైపుణ్యం ఉన్నప్పుడే సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తు తం బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని అయితే ఆరు నె లల పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఇ న్ఫెక్షన సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అన్ని జా గ్రత్తలు సూచించి బాధితుడు వీరభద్రను డిశ్చార్జ్‌ చేసి పంపుతున్నామని తొలిసారిగా కరువు జిల్లా అనంతలో కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతం చేయడం ఆనం దంగా ఉందని వారు వెల్లడించారు.