కిడ్స్‌ కోసం మెసెంజర్‌లో సేఫ్టీ ఫీచర్‌

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

‘ప్లెడ్జ్‌ ప్లానెట్స్‌’ పేరిట సేఫ్టీ ఫీచర్‌ను ప్రత్యేకించి పిల్లల పరిరక్షణ కోసం మెసెంజర్‌ ఆరంభించింది. ఇంటర్నెట్‌ను సేఫ్‌గా ఉపయోగించడానికి తోడు ఆరోగ్యకరమైన చర్చల కోసం ఈ ఫీచర్‌ తోడ్పడనుంది. ...

కిడ్స్‌ కోసం మెసెంజర్‌లో సేఫ్టీ ఫీచర్‌

‘ప్లెడ్జ్‌ ప్లానెట్స్‌’ పేరిట సేఫ్టీ ఫీచర్‌ను ప్రత్యేకించి పిల్లల పరిరక్షణ కోసం మెసెంజర్‌ ఆరంభించింది. ఇంటర్నెట్‌ను సేఫ్‌గా ఉపయోగించడానికి తోడు ఆరోగ్యకరమైన చర్చల కోసం ఈ ఫీచర్‌ తోడ్పడనుంది. సంబంధిత నిపుణుల ప్రమేయంతో ఈ ఫీచర్‌ను మెసెంజర్‌ అభివృద్ధి చేసింది.  ఒక సిద్ధాంతం ప్రాతిపదికగా వేర్వేరు ప్లానెట్స్‌ -  బి కైండ్‌, బి సేఫ్‌, బీ రెస్పెక్ట్‌ఫుల్‌, హావ్‌ ఎ ఫన్‌ వంటివి రూపొందించారు. ఇందులో ప్రతి ఎపిసోడ్‌లోని  కేరెక్టర్లకు సమస్యల పరిష్కారంలో కిడ్స్‌ సహాయపడుతుంటారు.  అదే సమయంలో నిర్ణయాలనూ తీసుకుంటారు. సదరు గేమ్‌  పూర్తిచేసేసరికి పిల్లకు ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మొదటి ఎపిసోడ్‌ ‘బి కైండ్‌’ అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST