ఐపీఓకు కిమ్స్‌

ABN , First Publish Date - 2021-03-02T06:30:41+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ప్రాథమిక ప్రతిపాదన పత్రాన్ని (డీఆర్‌హెచ్‌పీ) సెబీకి సమర్పించింది. ఇష్యూలో కొత్త షేర్లను జారీ

ఐపీఓకు కిమ్స్‌

రూ.200 కోట్ల కొత్త షేర్లు జారీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ప్రాథమిక ప్రతిపాదన పత్రాన్ని (డీఆర్‌హెచ్‌పీ) సెబీకి సమర్పించింది. ఇష్యూలో కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ.200 కోట్ల వరకూ సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా 2.13 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ కేహెచ్‌ పీటీఈ 1.39 కోట్ల షేర్లను, కిమ్స్‌ ప్రమోటర్‌ భాస్కర రావు 7.7 లక్షల షేర్లను విక్రయించనున్నారు. మరో ప్రమోటర్‌ రాజ్యశ్రీ 11.6 లక్షల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపులు తదితరాలకు చెల్లిస్తారు. ఏకీకృత ప్రాతిపదికన కిమ్స్‌కు రూ.262 కోట్ల రుణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుబంధ కంపెనీలు తీసుకున్న రుణాలకు కిమ్స్‌ కార్పొరేట్‌ గ్యారంటీ ఇచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా 2020 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు కిమ్స్‌ ఆదాయం రూ.71.40 కోట్లకు పరిమితమైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.856.38 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కిమ్స్‌ తొమ్మిది మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 

Updated Date - 2021-03-02T06:30:41+05:30 IST