ప్రేమికుడిని హత్య చేసిన యువతి బంధువులు!

ABN , First Publish Date - 2021-10-25T00:58:09+05:30 IST

కర్ణాటకలోని బలగనూర్ గ్రామస్థులు రవి నింబరగి

ప్రేమికుడిని హత్య చేసిన యువతి బంధువులు!

బెంగళూరు : కర్ణాటకలోని బలగనూర్ గ్రామస్థులు రవి నింబరగి (32),  అమీనా బేగం (24) ప్రేమించుకోవడం ఇష్టం లేని ఆ యువతి బంధువులు ఆయనను హత్య చేశారు. శుక్రవారం అదృశ్యమైన రవి హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు అమీనా సోదరుడిని, అంకుల్‌ను అరెస్టు చేశారు. ఆమె ముందుగానే పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 


కర్ణాటకలోని విజయపుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  రవి, అమీనా ఐదేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను అమీనా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. గ్రామ పెద్దలు ఈ ఇద్దరి కుటుంబ సభ్యులతో ఓ సమావేశం నిర్వహించి, అమీనాను వదులుకోవాలని రవిని ఆదేశించారు. అయితే ఇటీవల రవితో అమీనా కుటుంబ సభ్యులు ఘర్షణపడటంతో ఆమె అల్మేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రవిని తన కుటుంబ సభ్యులు అపహరించి, దాడి చేశారని ఆరోపించారు. కానీ రవి ఆచూకీని పోలీసులు గుర్తించడంలో విఫలమయ్యారు. రవి మృతదేహం శనివారం ఓ వ్యవసాయ బావిలో కనిపించింది. ఈ కేసులో అమీనా సోదరుడిని, అంకుల్‌ను అరెస్టు చేశారు. 


Updated Date - 2021-10-25T00:58:09+05:30 IST