‘ఇండియా’ కింగ్‌.. సేన్‌

ABN , First Publish Date - 2022-01-17T08:35:29+05:30 IST

‘ఇండియా’ కింగ్‌.. సేన్‌

‘ఇండియా’ కింగ్‌.. సేన్‌

డబుల్స్‌ విజేత సాత్విక్‌ జోడీ 

ప్రపంచ చాంపియన్లను చిత్తుచేసి టైటిళ్లు కైవసం

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో ఆతిథ్య జట్టు షట్లర్లు సత్తాచాటారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ విజేతలుగా నిలిచి ఆనందాన్ని ‘డబుల్‌’ చేశారు. ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్లను చిత్తుచేసి వీళ్లు టైటిళ్లు నెగ్గడం మరో విశేషం. గతనెల ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన 20 ఏళ్ల లక్ష్యసేన్‌ సొంతగడ్డపై టోర్నీలోనూ అదే ఫామ్‌ను చాటుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్‌ 24-22, 21-17తో సింగపూర్‌కు చెందిన ఐదోసీడ్‌ లో కీన్‌ యేపై విజయం సాధించాడు. గతంలో లో కీన్‌తో మూడుసార్లు తలపడి రెండుసార్లు ఓడిన లక్ష్య.. ఈ విజయంతో ముఖాముఖి రికార్డును 2-2తో సమం చేశాడు. లక్ష్యసేన్‌కు కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌ 500 టైటిల్‌. గతంలో రెండు సూపర్‌ 100 టైటిళ్లు (డచ్‌ ఓపెన్‌, సార్‌లార్‌లక్స్‌ ఓపెన్‌) నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసానన్‌ ఓన్గారుంగ్‌పాన్‌ గెలుచుకుంది. ఫైనల్లో బుసానన్‌ 22-20, 19-21, 21-13తో తన దేశానికే చెందిన ఆరోసీడ్‌ సుపనిద కాటేతోంగ్‌ను ఓడించింది.

Updated Date - 2022-01-17T08:35:29+05:30 IST