Jul 29 2021 @ 19:12PM

‘కిరాత‌క’.. కీలక అప్‌డేట్

ఆది సాయికుమార్, పాయ‌ల్‌ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాత‌క‌’. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ఈ మూవీని విజ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కిరాత‌క టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగించుకున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ 13 నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 


ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మా హీరో ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌ల హిట్‌ కాంబినేష‌న్‌లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో వస్తోన్న చిత్ర‌మిది. మేకింగ్ ప‌రంగా ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా టెక్నిక‌ల్‌గా హైస్టాండ‌ర్డ్స్‌లో నిర్మించ‌బోతున్నాం. ఆగ‌స్ట్‌13 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని తెలుపగా ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రమ్ మాట్లాడుతూ.. ‘‘ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌య్యింది. కిరాత‌క టైటిల్‌తో పాటు ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పూత్ కాంబినేష‌న్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. పూర్ణ, దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ తో పాటు మ‌రికొంత‌మంది ఫేమ‌స్ నటీనటులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. వారి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.