Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రిగారి డ్యాన్స్.... మెచ్చుకున్న మోదీ

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు చేసిన డ్యాన్స్ ప్రధాని దృష్టిని ఆకర్షించింది. మంత్రి డ్యాన్స్ చూసిన వెంటనే ప్రధాని స్పందించకుండా ఉండలేకపోయారు. ‘‘రిజుజు ఓ మంచి డ్యాన్సర్’’ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు. గ్రామంలోని ఓ సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్న రిజుజు అక్కడ కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.  


సుందరమైన కజలంగ్ గ్రామంలోని వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్ట్స్ పర్యవేక్షణకు వెళ్లానని, ఆ గ్రామానికి ఎవరైనా అతిథులు వస్తే అక్కడి సజోలంగ్ ప్రజలు ఇలాగే ఉత్సాహంగా ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. జానపదాలు, డ్యాన్స్‌లు దానికి మరింత అందాన్ని జోడిస్తాయన్నారు.


అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతీ తెగలోనూ ఇలాంటి ఆచారాలే ఉంటాయని కేంద్ర మంత్రి రిజుజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జానపద గీతాలకు అనుగుణంగా మంత్రి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రధాని స్పందించారు. ‘‘మన న్యాయశాఖ మంత్రి మంచి డ్యాన్సర్ కూడా. అరుణాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన సంస్కృతిని చూడడం చాలా బాగుంది’’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement