Abn logo
Oct 27 2021 @ 12:30PM

నల్లచట్టాలను రద్దు చేయాలి: Kisan Morcha

హైదరాబాద్/చిక్కడపల్లి: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మొదలై 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ పశ్య పద్మ, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి. సాగర్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆమోదించిన మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, అప్పటివరకు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.  ఆలిండియా కిసాన్‌సం్‌ఘ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు వి. చలపతిరావు, రాజారామ్‌, కొండారెడ్డి, అరుణహరీష్‌, మూడ్‌ శోభన్‌, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption