వీలైతే సేవ చేయండి లేదంటే సలహాలివ్వండి: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-12T17:14:55+05:30 IST

హైదరాబాద్‌: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆ ఆస్పత్రిని వ్యాక్సినేషన్, కొవిడ్ ఆస్పత్రిగా మార్చే అంశాన్ని పరిశీలించారు.

వీలైతే సేవ చేయండి లేదంటే సలహాలివ్వండి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆ ఆస్పత్రిని వ్యాక్సినేషన్, కొవిడ్ ఆస్పత్రిగా మార్చే అంశాన్ని పరిశీలించారు. కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. త్రివిధ దళాలు, పారామిలిటరీ రిటైర్డ్ వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. యువతకు 15 రోజుల పాటు  శిక్షణను ఇచ్చి వారి సేవలు ఉపయోగించుకుంటామన్నారు. మెడికోల సేవలను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉద్యోగాల్లో వెయిటేజ్ ఇస్తామన్నారు. దేశంలోని ఆర్మీ ఆస్పత్రి, రైల్వే ఆస్పత్రి, ఎయిమ్స్ సహా.. అన్ని ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నామన్నారు. వీలైతే సేవ చేయాలి, సలహాలివ్వాలి కానీ ప్రభుత్వాన్ని విమర్శించి, అడ్డంకులు సృష్టించొద్దని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-05-12T17:14:55+05:30 IST