Abn logo
Oct 30 2020 @ 14:43PM

కేసీఆర్, కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారు: కిషన్‌రెడ్డి

సిద్దిపేట: దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement