Abn logo
Nov 26 2020 @ 14:30PM

పాతబస్తీలో రోహింగ్యాలున్నారన్న సమాచారం మాకుంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పిస్తున్నారో ముఖ్యమంత్రే బయటపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తామన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి.. జాతీయ అంశాలను మాట్లాడటం కేటీఆర్ చేతకాని తనంగా కిషన్‌రెడ్డి అభివర్ణించారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని కిషన్‌రెడ్డి ఖండించారు. 


Advertisement
Advertisement