టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎం‌కు వేసినట్లే: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-11-22T23:41:34+05:30 IST

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డితో..

టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎం‌కు వేసినట్లే: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ఫిలింనగర్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి వెల్దండ వెంకటేశ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎం‌కు వేసినట్లేనని కిషన్‌రెడ్డి తెలిపారు. 


మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ ‘‘ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ను వరదల నగరంగా మార్చారు. వరద బాధితుల్ని సీఎం పరామర్శించకపోవడం దారుణం. ప్రగతి భవన్ బాగుంటే సరిపోతుందా?. పేదల కష్టాలను సీఎం పట్టించుకోవటం లేదు.’’ అని అన్నారు. 



Updated Date - 2020-11-22T23:41:34+05:30 IST