Advertisement
Advertisement
Abn logo
Advertisement

హుజురాబాద్ ఎన్నిక తర్వాత దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదు?: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత బంధుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను మభ్య పెట్టేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదో ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, దళితులకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే తక్షణమే దళిత బంధు కొనసాగించాలని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement