Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 10 2021 @ 14:31PM

ఖైరతాబాద్ గణేషున్ని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషున్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అతిపెద్ద వాక్సినేషన్ సాగుతోందని, కరోనా నుంచి విముక్తి కలగాలని వినాయకుడిని కోరుకుంటున్నానని తెలిపారు. పక్క దేశాలు కుట్రలు చూస్తున్నామని, విదేశీ కుట్రలను ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని గణేషున్ని కోరుకున్నానని తెలిపారు. దేశ ప్రజలందరీ కిషన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత తొలి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 40 అడుగుల హైదరాబాద్ గణేష్‌కు కుడిమైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు.

Advertisement
Advertisement