కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-01-24T00:36:49+05:30 IST

దక్షిణ భారత్‌ను కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న.. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఖండించారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: దక్షిణ భారత్‌ను కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న.. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభమన్నారు. కేటీఆర్‌ ఆడగముందే హైదరాబాద్‌కు ఎన్‌సీడీసీను కేటాయించిందని గుర్తుచేశారు. ఎన్‌సీడీసీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించడం లేదని కిషన్‌ రెడ్డి తప్పుబట్టారు. బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని వెంటనే కేంద్రానికి అప్పజెప్పాలన్నారు. వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయ సమస్యలు లేవని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలన్నారు. రెండో విడతలో దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2021-01-24T00:36:49+05:30 IST