కిచెన్‌ గార్డెన్‌ మొదలెడుతున్నారా!

ABN , First Publish Date - 2021-04-12T05:34:35+05:30 IST

కిచెన్‌ గార్డెన్‌ను కంటైనర్‌ గార్డెన్‌ అని కూడా అంటారు. టొమాటో, బెండ, దొండ, వంకాయ, పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటివి కిచెన్‌ గార్డెన్‌లో పెంచేందుకు అనువైనవి. మొక్కలు పెంచేందుకు 14 ఇంచుల పొడవు, 2 ఫీట్ల వెడల్పు ఉన్న గ్రో బ్యాగ్స్‌ మార్కెట్‌లో...

కిచెన్‌ గార్డెన్‌ మొదలెడుతున్నారా!

బాల్కనీలో లేదా మిద్దె మీద ఇంటికి సరిపోయే కూరగాయలు పండించాలనుకుంటున్నాం. కిచెన్‌ గార్డెనింగ్‌కు ఏమేం అవసరమవుతాయి?


కిచెన్‌ గార్డెన్‌ను కంటైనర్‌ గార్డెన్‌ అని కూడా అంటారు. టొమాటో, బెండ, దొండ, వంకాయ, పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటివి కిచెన్‌ గార్డెన్‌లో పెంచేందుకు అనువైనవి. మొక్కలు పెంచేందుకు 14 ఇంచుల పొడవు, 2 ఫీట్ల వెడల్పు ఉన్న గ్రో బ్యాగ్స్‌ మార్కెట్‌లో రూ.90 నుంచి 110 రూపాయల్లో లభిస్తాయి. బాల్కనీ, మిద్దె స్థలంను బట్టి గుండ్రని, త్రిభుజాకారం, చతురస్రం ఆకారంలో ఉండే గ్రో బ్యాగ్స్‌, కుండీలను ఎంచుకోవాలి. 


  1. 30 శాతం చొప్పున ఎర్ర మట్టి, కోకో పీట్‌, వర్మీకంపోస్ట్‌, 10శాతం ఇసుక తీసుకొని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఈ మట్టిని గ్రో బ్యాగ్స్‌లో లేదా కుండీల్లో నింపాలి.. 
  2. గ్రీన్‌హౌజ్‌, నర్సరీలలో మొక్కలు తెచ్చుకోవచ్చు. టొమాటో అనుకోండి.... హైబ్రిడ్‌ టొమాటో, ఇంట్లో ఉన్న టొమాటో లేదా కుళ్లిన టొమాటో గింజలను గ్రో బ్యాగ్‌ లేదా కుండీల్లో విత్తాలి. 10-15 నిమిషాల తరువాత నీళ్లు పోయాలి. గ్రో బాగ్స్‌ లేదా కుండీలు పూర్తిగా తడారిపోయేదాకా చూడొద్దు. రోజూ విడిచి రోజూ నీళ్లు పోయాలి. మొక్కలకు రోజు కనీసం ఆరు గంటలు ఎండ తగిలేలా చూడాలి. 
  3. కిచెన్‌ గార్డెన్‌లోని మొక్కలకు ఎక్కువగా ‘ప్లానీమోర్‌’ అనే వ్యాధి వస్తుంది. ఆకుల మీద తెలుపు, పసుపు పచ్చ రంగులో గుళికలు ఏర్పడతాయి. అప్పుడు 15 రోజులకోసారి 11 లీటర్ల నీటిలో 4 మిల్లీలీటర్ల నీమ్‌ ఆయిల్‌ కలిపి వ్యాధి సోకిన మొక్కలపై స్ర్పే చేయాలి.  
  4. మొక్కలకు ఎరువుగా  రోజూ కిచెన్‌లో మిగిలిన కూరగాయల తొక్కలు, తొడిమెలను వేయాలి. వీటిని ఒక రోజు ఎండలో లేదా నీడలో ఉంచిన తరువాత మొక్కల పాదుల్లో వేయాలి. ఇలాచేస్తే మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. 

- కె.పి.రావు, 

ప్రొఫెషనల్‌ ల్యాండ్‌స్కేప్‌ డిజైనర్‌, 8019411199.


Updated Date - 2021-04-12T05:34:35+05:30 IST