కివి మింట్‌ లెమనేడ్‌

ABN , First Publish Date - 2021-05-03T21:17:58+05:30 IST

ఎండల్లో చల్లగా లెమనేడ్‌ తాగితే ఎంతో శక్తి తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటిదే కివి మింట్‌ లెమనేడ్‌. దీని తయారీ చూద్దాం...

కివి మింట్‌ లెమనేడ్‌

ఎండల్లో చల్లగా లెమనేడ్‌ తాగితే ఎంతో శక్తి తిరిగొచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటిదే కివి మింట్‌ లెమనేడ్‌. దీని తయారీ చూద్దాం...


కావలసినవి: కివి పండ్లు- రెండు (తోలు వొలిచి ముక్కలుగా కోయాలి), నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు, పుదీనా ఆకులు- 20, చక్కెర- నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఫిల్టర్‌ నీళ్లు - 200మి.లీ, సోడా -200మి.లీ. 


తయారీ: మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి కివి పండ్ల ముక్కలు, చక్కెర వేసి మిక్సీ పట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద జార్‌లో పోసి నిమ్మరసం, తరిగిన పుదీనా ఆకులు, నీళ్లు పోసి బాగా కలపాలి. కివి మింట్‌ లెమనేడ్‌ను గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌, సోడా వేసి చల్ల చల్లగా అందించాలి. 


Updated Date - 2021-05-03T21:17:58+05:30 IST