విండీస్‌పై కివీస్‌ విజయం

ABN , First Publish Date - 2020-11-28T09:11:57+05:30 IST

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన వర్ష ప్రభావిత తొలి మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలిచింది. మొదట విండీస్‌ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. కెప్టెన్‌ పొలార్డ్‌ (75 నాటౌట్‌) రాణించడంతో విండీస్‌ 180/7

విండీస్‌పై కివీస్‌ విజయం

ఆక్లాండ్‌: వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన వర్ష ప్రభావిత తొలి మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలిచింది. మొదట విండీస్‌ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. కెప్టెన్‌ పొలార్డ్‌ (75 నాటౌట్‌) రాణించడంతో విండీస్‌ 180/7 స్కోరు చేసింది.  ఫెర్గూసన్‌ (5/21) ఐదు వికెట్లు తీశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మూడుసార్లు వర్షం అంతరాయం కల్గించింది. తర్వాత డక్‌వర్త్‌ ప్రకారం  కివీస్‌ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176 పరుగులకు కుదించారు. నీషమ్‌ (48 నాటౌట్‌), కాన్వే (41) మెరవడంతో కివీస్‌ 15.2 ఓవర్లలో 179/5 స్కోరు చేసి విజయం సాధించింది.

Updated Date - 2020-11-28T09:11:57+05:30 IST