Abn logo
Sep 18 2021 @ 23:34PM

‘మైండ్‌గేమ్‌ ఆడుతున్న వైసీపీ’

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 18: కాకినాడ మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతు ఇస్తుందని, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు శనివారంలో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత మేయర్‌ని తప్పించేందుకు టీడీపీ కార్పొరేటర్లతో వైసీపీ కుమ్మకై బీజేపీని పావుగా చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ కార్పొరేటర్లకు విప్‌ జారీ చేస్తామన్నారు.