ప్రధాన కూడళ్ల సుందరీకరణకు చర్యలు

ABN , First Publish Date - 2021-07-31T05:16:18+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 30: నగరంలోని ప్రధాన కూడళ్లు సుందరీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన జడ్పీ సెంటర్‌ నుంచి పొట్టి శ్రీరాముల సెంటర్‌ వరకూ పరిసరాలను పరిశీలించారు. పనుల్లో అసమర్థతను గమనించిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్‌ కాలేషా, డీఈ సత్యకుమారి, వెంకటలక్ష్మి,

ప్రధాన కూడళ్ల సుందరీకరణకు చర్యలు
నగరంలో పర్యటిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌

కాకినాడ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 30: నగరంలోని ప్రధాన కూడళ్లు సుందరీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన జడ్పీ సెంటర్‌ నుంచి పొట్టి శ్రీరాముల సెంటర్‌ వరకూ పరిసరాలను పరిశీలించారు. పనుల్లో అసమర్థతను గమనించిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్‌ కాలేషా, డీఈ సత్యకుమారి, వెంకటలక్ష్మి, ఉద్యానవనశాఖ ఏడీ శిరిల్‌ పాల్గొన్నారు. జగన్నాథపురంలో మహాలక్ష్మినగర్‌, చీడిలపోర ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటించారు. నగరాన్ని క్లీన్‌అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో రూ.కోటితో డ్రైన్ల నిర్మాణం జరుగుతుందని, నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. డ్రైన్లపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. రాజాట్యాంక్‌ పార్కు ఆవరణలో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ ఎగ్జిబిషన్‌ను కమిషనర్‌ ప్రారంభించారు. నగరాన్ని పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. నగరపాలక సంస్థ ఎస్‌ఈ సత్యనారాయణ రాజు, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:16:18+05:30 IST