జీజీహెచ్‌కు లక్ష్య అవార్డు గర్వకారణం

ABN , First Publish Date - 2021-06-20T05:13:34+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 19: రాష్ట్రంలోనే ఉత్తమ గైనిక్‌ విభాగంగా ఖ్యాతి గడించిన కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)కి జాతీయస్థాయిలో లక్ష్య అవార్డు సొంతం చేసుకోవడం జిల్లాకే గర్వకారణమని అసిస్టెంట్‌ కలెక్టర్‌, కొవిడ్‌ ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చం

జీజీహెచ్‌కు లక్ష్య అవార్డు గర్వకారణం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌

కొవిడ్‌ ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌ 

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 19: రాష్ట్రంలోనే ఉత్తమ గైనిక్‌ విభాగంగా ఖ్యాతి గడించిన కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)కి జాతీయస్థాయిలో లక్ష్య అవార్డు సొంతం చేసుకోవడం జిల్లాకే గర్వకారణమని అసిస్టెంట్‌ కలెక్టర్‌, కొవిడ్‌ ప్రత్యేక నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణభారతి ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డెవలె్‌పమెంట్‌ సొసైటీ (సీడ్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రసవాల కోసం అధికసంఖ్యలో నిత్యం జీజీహెచ్‌కు రావడం ఇక్కడ వైద్యుల పనితీరుకు నిదర్శనమన్నారు. అత్యధిక ప్రసవాలు చేసే విధంగా డాక్టర్లు సమిష్టి కృషితో అంకితాభావంతో వైద్యచికిత్సలు అందించడం ద్వారా నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జీజీహెచ్‌ లక్ష్య అవార్డు సొంతం చేసుకుందని తెలిపారు. గర్భిణుల ప్రసవాలు, ఆపరేషన్లు, చిన్నారులకు గైనిక్‌ విభాగంలో అరుదైన ఘనత సాధించడంలో అప్పటి సూపరింటెండెంట్‌, డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు, గైనిక్‌ హెచ్‌వోడీ, వైద్యులు ఎనలేని కృషి చేశారని కితాబిచ్చారు. డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు, గైనిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ లావణ్యకుమారి, వైద్యబృందం సభ్యులను ఘనంగా సత్కరించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి, సీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:13:34+05:30 IST