జీజీహెచ్‌కు రూ.2 లక్షల మందుల వితరణ

ABN , First Publish Date - 2021-09-29T05:52:09+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 28: కాకినాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ విభాగానికి రూ.2లక్షల విలువైన అత్యవసర మందులను మ ంగళవారం ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మికి అందించారు. చిన్నారుల విభాగంలో ఇటీవల డెంగీ కేసులు అధికం కావ

జీజీహెచ్‌కు రూ.2 లక్షల మందుల వితరణ

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 28: కాకినాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ విభాగానికి రూ.2లక్షల విలువైన అత్యవసర మందులను మ ంగళవారం ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మికి అందించారు. చిన్నారుల విభాగంలో ఇటీవల డెంగీ కేసులు అధికం కావడంతో ఎన్‌ఐసీయూ, పీఐసీయూల్లో జ్వరపీడితుల తాకిడి అధికంగా ఉండడంతో ఆ విభాగ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తమ దృష్టికి తీసుకువచ్చినట్టు రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు తాడాల వరప్రసాద్‌ తెలిపారు. ఈ రెండు విభాగాలను పరిశీలించిన తర్వాత వివిధ రకాల మందులు అందించామన్నారు. త్వరలో రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఐసీయూ, పీఐసీయూల్లో వెంటిలేటర్లు, ఫోటోథెరపీ పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రోటరీక్లబ్‌ సభ్యులకు మహాలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. విభాగాధిపతి డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, రోటరీ క్లబ్‌ కార్యదర్శి పోలిశెట్టి ఈశ్వరరావు, డాక్టర్‌ అరుణాదిత్య, ఏవీ రంగారావు, కపిల్‌ లునాని, డాక్టర్‌ తాడాల అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T05:52:09+05:30 IST