కొవిడ్‌ నిబంధనలతో మాఘ మాసోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-29T05:43:48+05:30 IST

సర్పవరం జంక్షన్‌, జనవరి 28: థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ నిబంధనలకు లోబడి మాఘమాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మదాయశాఖ రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ కమిషనర్‌ కేఎన్‌డీవీ ప్రసాద్‌ తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం సర్ప

కొవిడ్‌ నిబంధనలతో మాఘ మాసోత్సవాలు

దేవదాయ, ధర్మదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ 

సర్పవరం జంక్షన్‌, జనవరి 28: థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ నిబంధనలకు లోబడి మాఘమాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మదాయశాఖ రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ కమిషనర్‌ కేఎన్‌డీవీ ప్రసాద్‌ తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు పుల్ల శేషుకుమారి అధ్యక్షతన వచ్చే నెల 2 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న మాఘమాస ఉత్సవాలపై ట్రస్ట్‌బోర్డు సభ్యులతో సమావేశం శుక్రవారం నిర్వహించారు. మాఘ మాసోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 6, 13, 20, 27వ తేదీల్లో వచ్చే 4 ఆదివారాల్లో స్వామివారి తిరునాళ్లు జరుగుతాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కమిటీ సభ్యులు సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయలక్ష్మి, ట్రస్ట్‌ కమిటీ సభ్యులు అనంతలక్ష్మి, వనుం మురళీ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-29T05:43:48+05:30 IST