విద్యుత్‌ చార్జీల పెంపుతో తీరని నష్టం

ABN , First Publish Date - 2021-10-24T05:17:18+05:30 IST

కరప, అక్టోబరు 23: వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్‌ చార్జీల వల్ల అన్నివర్గాల ప్రజలకు తీరని నష్టం చేకూరుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరప మండలం గురజనాపల్లి, అడవిపూడి, గొర్రిపూడి, యండమూరు, విజయరా

విద్యుత్‌ చార్జీల పెంపుతో తీరని నష్టం
యండమూరులో నిరసన తెలుపుతున్న పిల్లి సత్తిబాబు దంపతులు

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తిబాబు

కరప, అక్టోబరు 23: వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్‌ చార్జీల వల్ల అన్నివర్గాల ప్రజలకు తీరని నష్టం చేకూరుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరప మండలం గురజనాపల్లి, అడవిపూడి, గొర్రిపూడి, యండమూరు, విజయరాయుడుపాలెం గ్రామాల్లో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేయాలని సూ చించారు. వైసీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి అరాచక పాలనను తేటతెల్లం చేయాలన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సిం హాద్రి, పంపన కన్నారావు, సుకుమార్‌, సర్వసిద్ది ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:17:18+05:30 IST