పది ఓవర్లకు కోల్‌కత్తా స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2020-09-24T04:16:45+05:30 IST

ఐపీఎల్‌-2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా తడబడుతోంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి 10 ఓవర్లు...

పది ఓవర్లకు కోల్‌కత్తా స్కోరు ఎంతంటే..

దుబాయ్: ఐపీఎల్‌-2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా తడబడుతోంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి 10 ఓవర్లు ముగిసే సరికి 71 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్ వెంటనే ఔట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. దీంతో కెప్టెన్ దినేశ్ కార్తీక్, నితీశ్ రాణాలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్కోరు బోర్డు నెమ్మదిగా కదులుతుండడంతో కావలసిన రన్‌రేట్ భారీగా పెరుగుతోంది. మరో పది ఓవర్లలో కోల్‌కతా 125 పరుగులు చేయాల్సి ఉంది. అయితే వికెట్లను కాపాడుకుంటున్న కోల్‌కతా తదుపరి పది ఓవర్లలో అయినా బ్యాట్ ఝుళిపిస్తుందేమో చూడాలి.

Updated Date - 2020-09-24T04:16:45+05:30 IST