Abn logo
Sep 24 2021 @ 00:30AM

మళ్లీ ఓడిన ముంబై.. కేకేఆర్ సూపర్ విక్టరీ

అబుధాబి: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. ఓవర్‌కు 10కి పైగా రన్‌రేట్‌తో కేవలం 15.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి అదరగొట్టింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (13) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యార్(53: 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్: 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థసెంచరీతో జట్టును విజయం వైపు నడిపించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఒక్కడే 3 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో ఎవరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం. కాగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనూహ్యంగా ఒక్క వికెట్ తీసి 4 ఓవర్లోల కేవలం 5  ఎకానమీతో పరుగులు కట్టడి చేసిన సునీల్ నరైన్‌కు దక్కింది.

తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ(33: 30 బంతుల్లో 4 ఫోర్లు), క్వింటన్ డికాక్(55: 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. వికెట్లు పడకుండా కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. అయితే 10వ ఓవర్లో రోహిత్ అవుట్ కావడం, ఆ వెంటనే సూర్యకుమార్(5) కూడా అలా వచ్చి ఇలా వెళ్లడంతో ముంబై కష్టాల్లో పడింది. మరోవైపు కేకేఆర్ బౌలర్లు పట్టుబిగించడంతో 200 దాటుతుందనుకున్న ముంబై స్కోరు 155 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ 14, కీరన్ పొలార్డ్ 21, కృనాల్ పాండ్యా 12 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో పెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్‌కు ఓ వికెట్ దక్కింది.