Abn logo
Sep 23 2021 @ 21:34PM

IPL 2020: చెలరేగి చతికిలపడిన ముంబై ఇండియన్స్

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత మెరుపులు మెరిపించి ఆ తర్వాత చతికిల పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155  పరుగులు చేసింది. 


తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ చెలరేగిపోయారు. మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించడంతో పరుగులు వెల్లువలా వచ్చి పడ్డాయి. బౌలర్ ఎవరన్న దానితో పనిలేకుండా ఇద్దరూ విరుచుకుపడ్డారు. 30 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన రోహిత్ తొలి వికెట్‌గా అవుటైన తర్వాత పరుగుల వేగం మందగించింది. ఆ వెంటనే సూర్యకుమార్ (5) అవుట్ కాగా, 42 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేసిన డికాక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.


దీంతో అప్పటి వరకు కనిపించిన పరుగల ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. మరోవైపు, బౌలర్లు పట్టుబిగించడంతో 200 దాటుతుందనుకున్న ముంబై స్కోరు 155 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ 14, కీరన్ పొలార్డ్ 21, కృనాల్ పాండ్యా 12 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో పెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్‌కు ఓ వికెట్ దక్కింది.