టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ABN , First Publish Date - 2020-10-17T00:41:59+05:30 IST

ముంబై ఇండియన్స్‌తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దినేశ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దినేశ్ కార్తీక్ సారథ్యంలో ఆడిన కోల్‌కతా ఆటగాళ్లు నేడు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఆడనున్నారు. వికెట్ బాగుందని, తొలుత భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తామని మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. బాంటన్, నాగర్‌కోటిలను బెంచ్‌కు పరిమితం చేసి శివం మావి, క్రిస్ గ్రీన్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు.  ముంబై జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. జేమ్స్ పాటిన్సన్ స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్ జట్టులోకి వచ్చాడు. 

Updated Date - 2020-10-17T00:41:59+05:30 IST