Abn logo
Sep 23 2021 @ 19:11PM

IPL 2021: ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ సెకండ్ బ్యాటింగ్ కలిసొచ్చిందని ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ముందుకెళ్తామని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. మొన్నటి జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే కేకేఆర్ బరిలోకి దిగుతోంది. ఇక తొలి మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపట్టాడు. తొలి మ్యాచ్‌లో ఆడిన అన్మోల్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption