Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాయంతో కేఎల్ రాహుల్ ఔట్.. సూర్యకుమార్ ఇన్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ తెలిపింది.


వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 29 ఏళ్ల రాహుల్ 40 టెస్టుల్లో 35.16 సగటుతో 2,321 పరుగులు చేశాడు. చెన్నైలో 2016లో  ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 199 పరుగులు చేశాడు. టెస్టుల్లో రాహుల్‌కు అదే అత్యధికం.


రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25 కాన్పూరులో తొలి టెస్టు ప్రారంభం కానుంది. డిసెంబరు 3న నుంచి జరగనున్న రెండో టెస్టుకు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది.   

Advertisement
Advertisement