జ్వరాల కేసులు ఎన్ని వస్తున్నాయ్‌?

ABN , First Publish Date - 2021-09-18T06:07:00+05:30 IST

‘ఆసుపత్రికి రోజుకు ఎంత మంది జ్వరాలతో వస్తున్నారు. ఎక్కు వగా ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు. డెంగ్యూ జ్వరా లు ఎక్కడి నుంచి వస్తున్నారు. మీరు సమాచారం చెబితే ఆ ప్రాంతంలోని పీహెచ్‌సీ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేద్దాం. చర్యలకు ఆదేశిస్తా’ అని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జిల్లా ఆసుపత్రి వైద్యులను అడిగారు.

జ్వరాల కేసులు ఎన్ని వస్తున్నాయ్‌?
ఖమ్మం ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఎక్కువగా ఏప్రాంతంలో నమోదవుతున్నాయి

చెబితే నివారణ చర్యలకు ఆదేశిస్తా

ఖమ్మం జిల్లా ఆసుపత్రి వైద్యులతో కలెక్టర్‌ గౌతమ్‌.. దవాఖానా సందర్శన

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: ‘ఆసుపత్రికి రోజుకు ఎంత మంది జ్వరాలతో వస్తున్నారు. ఎక్కు వగా ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు. డెంగ్యూ జ్వరా లు ఎక్కడి నుంచి వస్తున్నారు. మీరు సమాచారం చెబితే ఆ ప్రాంతంలోని పీహెచ్‌సీ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేద్దాం. చర్యలకు ఆదేశిస్తా’ అని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జిల్లా ఆసుపత్రి వైద్యులను అడిగారు. శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఓపీ విభాగం వద్ద వరుసలో నిల్చుని రోగుల నుంచి, ఆ తర్వాత వైద్యుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రక్త నమూనాల సేకరణ కేంద్రం, ఐసీయూ, ఫీవర్‌, సర్జికల్‌ వార్డులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలువురు ఇన్‌పేషంట్లతో మాట్లాడిన కలెక్టర్‌ ఆరోగ్యం, అందుతున్న వైద్యం, ఇస్తున్న మందుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా బల్లెపల్లికి చెందిన సుహాసిని, చంద్రుగొండకు చెందిన శ్రావ్య డెంగ్యూ జ్వరంతో చేరినట్లుచెప్పడంతో వారి కేస్‌ షీట్‌లను పరిశీలించారు. ఆతర్వాత కలెక్టర్‌ గౌతమ్‌ ఆస్పత్రి వైద్యులతో సమావేశమై ఆస్పత్రికి వస్తున్న రోగుల వివరాలు, ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, టైఫా యిడ్‌ కేసుల  వివరాలను వెల్లడిస్తే ఆయా ప్రాంతాల్లో పీహెచ్‌సీ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసే ఆస్కారం ఉందన్నారు. సీజనల్‌ వ్యాధులపై ఎప్పటికప్పుడు జి ల్లా వైద్య అధికారులకు సమాచారం అందించా లన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య ఏఎన్‌ఎంలు, ఆశావర్క ర్ల ద్వారా నియంత్రణ చర్యలు ముమ్మరం చేయా లన్నారు. ఆస్పత్రిలో డెంగ్యూ నిర్థారణ పరీక్షలకు ఎలీసా టెస్ట్‌ రిపోర్టులను 12 గంటల లోపే అందిం చాలని దీని ద్వారా వైద్య సేవల్లో జాప్యం జరక్కుండా చూడొచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యం పొందుతున్న గర్భిణులను షెడ్యూల్‌ ప్రకారం 102 వాహనాల ద్వారా జిల్లా ఆస్ప త్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యాఽ దికారులు సమయం పాటిస్తూ ఓపీ, ఇన్‌పేషంట్లకు మరింత మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి.శ్రీనివాసరావు, జనరల్‌ ఫిజీషియన్లు డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ రాంప్రసాద్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కృపాఉషశ్రీ, వైద్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-09-18T06:07:00+05:30 IST