ఎర్రబంగారం ధర ధగధగ

ABN , First Publish Date - 2020-09-25T11:06:16+05:30 IST

ఎర్రబంగారం ధగధగ మెరుస్తోంది. ఖమ్మం మార్కెట్‌లో ఏసీ మిర్చికి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం కోల్డ్‌స్టోరేజీ

ఎర్రబంగారం ధర ధగధగ

క్వింటా ఏసీ మిర్చి రూ.18,700

ఖమ్మం మార్కెట్‌లో రోజురోజుకు పెరుగుతున్న ధర

వారం రోజుల్లో రూ.4వేలు పెరుగుదల


ఖమ్మం మార్కెట్‌, సెప్టెంబరు 24 : ఎర్రబంగారం ధగధగ మెరుస్తోంది. ఖమ్మం మార్కెట్‌లో ఏసీ మిర్చికి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం కోల్డ్‌స్టోరేజీ ల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చి క్వింటాలు రూ.18,700 పలికింది. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో ఆగస్టు 9న మార్కెట్‌ ప్రారంభమవగా.. ఆరోజు క్వింటా రూ.14,000 పలకగా.. ఆగస్టు నెలాకరుకు రూ.15,000కు చేరింది.


అనంతరం ఈ నెల 4 నుంచి మార్కెట్‌లో క్వింటాలు రూ. 16వేలు, రూ.17వేలు పలికింది. ఆ తర్వాత బుధవారం రూ.17,400 పలికిన ఒక్క రోజులోనే రూ.1300 పెరిగి రూ.18,700కు చేరింది. ఏసీ మిర్చికి దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ రావడంతో.. వారం రోజుల్లోనే రూ.4,000 పెరగిందని వ్యాపారులు చెబుతున్నారు.


మరి కొద్ది రోజుల్లో రూ.20వేల మార్కును చేరుతుందంటున్నారు. ఏసీ మిర్చీ ధరలు ఊపందుకోవడంతో పంటను నిల్వచేసుకున్న రైతులు, వ్యాపారులు తమ పంటలను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

Updated Date - 2020-09-25T11:06:16+05:30 IST