మరో 883 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-11T11:55:13+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా 883 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య

మరో 883 కరోనా కేసులు

  • 28,314కు చేరిన బాధితులు 
  • ఆరుగురి మృతి 

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 10: జిల్లాలో సోమవారం కొత్తగా 883 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 28,314కు చేరింది. వీరిలో 9741 మంది చికిత్స పొందుతుండగా 18,322 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 251కు చేరింది. 


విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రిలో ఇబ్బందులు

విశ్వభారతి జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా సరైన వైద్యం అందడం లేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా వైద్యులు రావడం లేదని ఓ బాధితుడు సోమవారం ఉదయం తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆయాసంతో బాధపడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని, ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. బాత్‌రూంలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. 

Updated Date - 2020-08-11T11:55:13+05:30 IST