రైతులకు విరివిగా రుణాలివ్వండి: కలెక్టర్‌ వీరపాండియన్

ABN , First Publish Date - 2020-09-25T11:47:58+05:30 IST

పంట రుణాలు విరివిగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. సునయన ఆడిటోరియంలో ఆయన గురువారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించాలని

రైతులకు విరివిగా రుణాలివ్వండి: కలెక్టర్‌ వీరపాండియన్

కర్నూలు(ఆంధ్రజ్యోతి): పంట రుణాలు విరివిగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. సునయన ఆడిటోరియంలో ఆయన గురువారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలను వెంటనే ఇవ్వాలని సూచించారు.


జిల్లాలో రుణాల పంపిణీ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. పొదుపు మహిళలకు జీవనోపాధి రుణాలు కూడా సకాలంలో అందేలా చూడాలన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందని రైతులు బయటి రుణాలకు వెళుతున్నారని, రుణ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని బ్యాంకర్లతో అన్నారు. రైతులకు సమాజంలో మంచి హోదా ఉండాలని, వారు ప్రజలు ఆకలి తీర్చే అన్నదాతలని కలెక్టర్‌ అన్నారు.


ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రైతులకు రూ.4412.54 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా, 80.08 శాతం సాధించామని అన్నారు. వంద శాతం పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అర్హత కలిగిన రైతులకు ట్రాక్టర్‌ కొనుగోలు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రుణాలను ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు బ్యాంకర్లు కచ్చితంగా తమకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని, లక్ష్యాన్ని చేరుకోని బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 32,490 మంది కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులకు కచ్చితంగా రుణాలు ఇవ్వాలని హెచ్చరించారు.


కేంద్ర ప్రభుత్వం వీఽధి వ్యాపారులకు జీవనోపాధి కింద ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ పథకం కింద రూ.పది వేలు ఇవ్వాలని సూచించారు. పారిశ్రామికవేత్తలకు విరివిగా రణాలిచ్చి పరిశ్రమలను అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. అనంతరం పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టి, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, నాబార్డు ఏజీఎం పార్థసారథి, ఎల్‌డీఎం వెంకట నారాయణ, కెనారా బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ సుమలత, ట్రైనీ ఐపిఎస్‌ కొమ్మి ప్రతాప్‌ శివ కిషోర్‌తో కలిసి 2020-21 జిల్లా రుణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. 

Updated Date - 2020-09-25T11:47:58+05:30 IST