వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-09-25T11:44:57+05:30 IST

రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో వర్చువల్‌ పద్ధతిలో లోక్‌ అదాలత్‌ జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వీఆర్‌కే కృపాసాగర్‌, జిల్లా న్యాయ సేవ

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

దృశ్య, శ్రవణ సాధాలద్వారా నిర్వహణ

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రకటన


కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 24: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో వర్చువల్‌ పద్ధతిలో లోక్‌ అదాలత్‌ జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వీఆర్‌కే కృపాసాగర్‌, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


జిల్లా కోర్టు, మున్సిఫ్‌ కోర్టు, న్యాయ సేవ అధికార సంస్థ ప్రాంగణంలో వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లు జరుగుతాయని వారు పేర్కొన్నారు. కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అనుసరించి కక్షిదారులు భౌతికంగా రాకపోయినా దృశ్య, శ్రవణ విధానం ద్వారా నిర్వహించవచ్చని వారు తెలిపారు. ప్రతి నాలుగో శనివారం, నిర్దేశించిన ఇతర రోజులలో వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారానికి సిద్ధంగా ఉన్న కక్షిదారులు తమ కేసుల వివరాలతో కూడిన సమ్మతిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారికి ఎస్‌ఎంఎస్‌ లేదా వాట్స్‌యాప్‌ రూపంలో తెలియజేయాలని సూచించారు.


కక్షిదారులు మొబైల్‌ నెంబరు 97014 77624 ద్వారా సంప్రదించాలని సూచించారు. కక్షిదారులు బ్లూజీన్స్‌ మ్యాప్‌ ద్వారా లేదా వాట్స్‌యాప్‌ ద్వారా సంబంధిత చర్చలతో పాల్గొనవలసి ఉంటుందని, రాజీ నిబంధనలను పరిశీలించిన తర్వాత వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ బెంచి కేసు పరిష్కరించి, ఇరువర్గాలకూ తెలియజేస్తుందని న్యాయమూర్తులు వెల్లడించారు.


రాజీ పడదగిన అన్ని క్రిమినల్‌, సివిల్‌ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, వివాహ సంబంధ వాజ్యాలు పరిష్కరిస్తామని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీటితోపాటూ మైక్రోలెవెల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొని యథావిధిగా కేసులను పరిష్కారం చేసుకోవచ్చని వారు తెలిపారు. 

Updated Date - 2020-09-25T11:44:57+05:30 IST