పతంగులు ఎగురవేయడం చట్ట విరుద్ధమా?.. సంక్రాతికి ముందుగానే తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-01-13T15:34:53+05:30 IST

మనదేశంలో మకర సంక్రాంతి సందర్భంగా..

పతంగులు ఎగురవేయడం చట్ట విరుద్ధమా?.. సంక్రాతికి ముందుగానే తెలుసుకోండి!

మనదేశంలో మకర సంక్రాంతి సందర్భంగా పలు నగరాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. గాలిపటాలు ఎగరవేయడం చట్టవిరుద్ధమని, శిక్ష విధించే అవకాశాలున్నాయని మీకు తెలుసా? ఆ వివరాల ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం గాలిపటాలు ఎగురవేయడం చట్టవిరుద్ధం. ఎవరైనా గాలిపటం ఎగురవేయాలనుకుంటే, ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ చట్ట ప్రకారం ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ నడిపే ముందు అనుమతి తీసుకోవాలి. ఎయిర్ షిప్‌లు, గాలిపటాలు, గ్లైడర్‌లు, బెలూన్‌లు అవన్నీ ఇదేకోవలోకి వస్తాయి. దీని ప్రకారం చూస్తే గాలిపటాలు ఎగురవేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. 

Updated Date - 2022-01-13T15:34:53+05:30 IST