Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొబ్బరి బెండీ కూటు

కావలసిన పదార్థాలు

బెండ కాయలు: పావు కిలో, కొబ్బరి కోరు: కప్పు, శెనగలు: పావు కప్పు, చింతపండు: 50 గ్రాములు, మజ్జిగ: కప్పు, శెనగపప్పు, మినప్పప్పు: మూడు స్పూన్లు, ధనియాలు: మూడు స్పూన్లు, పచ్చిమిర్చి: 6, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: 50 గ్రాములు, తాలింపు గింజలు: మూడు స్పూన్లు


తయారు చేసే విధానం

శెనగల్ని నానబెట్టాలి. చింత పండు పులుసు తీసిపెట్టుకోవాలి. బెండ కాయల్ని ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఓ గిన్నెలో మజ్జిగపోసి దాంట్లో బెండకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. కొద్ది నూనెలో ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు ఒక్కోటి వేయించి పక్కనపెట్టుకోవాలి. కొబ్బరి, ఉప్పు కలిపి రుబ్బుకోవాలి. దీనికి వేయించిన ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు కలిపి గ్రైండ్‌ చేసిపెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి చింతపండు పులుసు, ఉడికిన బెండకాయలు, శెనగలు కలిపి పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తరవాత పోపు వేస్తే కొబ్బరి బెండీ కూటు రెడీ.

పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని