Abn logo

కొబ్బరి లడ్డూ

కొబ్బరితో కమ్మగా...

దీపావళి పండుగ అంటే దివ్వెల వెలుగులతో పాటు మిఠాయిలు ఉండాల్సిందే. అయితే కరోనా భయం ఉన్న ఈ సమయంలో బయట స్వీట్‌లు కొనడం ఎందుకు? ఇంట్లోనే కొబ్బరితో బర్ఫీ, లడ్డూ,  కజ్జికాయలు, చిక్కీలను ట్రై చేయండి. ఈ తీపి రుచులతో దీపావళిని  మరింత ఆనందంగా జరుపుకోండి. 


కావలసినవి: కోవా - అరకప్పు, నెయ్యి - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - పది పలుకులు, బాదం - పది పలుకులు, కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు, చిక్కటి పాలు- ఒక కప్పు.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కోవా వేసి కరిగించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో బాదం పలుకులను కూడా వేగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొబ్బరి తురుము వేసి వేగించాలి. గోధుమరంగులోకి మారాక చిక్కటి పాలు పోయాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కరిగించిన కోవా వేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, మధ్యలో జీడిపప్పు, బాదం పలుకు పెట్టి లడ్డూలు తయారుచేసుకోవాలి. చివరగా కొబ్బరి తురుము అద్దుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కజ్జికాయలుచిక్కీలుబర్ఫీదివాళీ పల్లీ పట్టిదివాళీ రవ్వలడ్డుషోర్‌ భాజామావా కోకొనట్‌ రోల్‌కడాకనీసగ్గుబియ్యం పాయసం (వీడియో)రసగుల్ల
Advertisement
Advertisement