ఎన్‌ఆర్ఐతో వివాహం..భర్తే కదా అని నమ్మింది..అతడు చేసిన నిర్వాకం తెలిసి చివరికి..

ABN , First Publish Date - 2021-10-26T00:34:10+05:30 IST

తన బ్యాంకు అకౌంట్లోని సొమ్మును కట్నం కింద తీసేసుకుని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కొచ్చికి చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తే కదా అని నమ్మి తాను ఇంతకాలం పొదుపు చేసిన సొమ్మంతా చేతిలో పెడితే ఇలా జరిగిందంటూ ఆమె వాపోయింది.

ఎన్‌ఆర్ఐతో వివాహం..భర్తే కదా అని నమ్మింది..అతడు చేసిన నిర్వాకం తెలిసి చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: తన బ్యాంకు అకౌంట్లోని సొమ్మును కట్నం కింద తీసేసుకుని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కొచ్చికి చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తే కదా అని నమ్మి తాను ఇంతకాలం పొదుపు చేసిన సొమ్మంతా చేతిలో పెడితే ఇలా జరిగిందంటూ ఆమె వాపోయింది. కేరళలోని కలామాసెరీ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఆమె కేసు నమోదు చేసింది. సదరు మహిళకు 2020, జనవరి 31న వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లైన పది రోజుల తరువాత ఆమె ఉద్యోగం నిమిత్తం మహిళ దోహాకు వెళ్లిపోగా.. ఆమె భర్త మస్కట్‌కు వెళ్లిపోయాడు. ఫిబ్రవరి  నెలాఖరున మళ్లీ ఎర్నాకుళానికి తిరిగొచ్చిన వారు తిరిగి మార్చి 1న మళ్లీ గల్ఫ్ వెళ్లిపోయారు.


కాగా.. ఈ జనవరి 14న ఆమె దోహాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో కలిసుండేందుకు మస్కట్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో దోహాలోని తన సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉన్న రూ. 29.75 లక్షలను భర్తకు మస్కట్‌లో ఉన్న అకౌంట్‌లోకి బదిలీ చేసింది. మస్కట్‌లో తన పేరిట మళ్లీ ఓ అకౌంట్ తెరిచాక డబ్బంతా తిరిగి ఇచ్చేయాలంటూ భర్త వద్ద మాట తీసుకున్నాకే ఆ మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ తరువాత అతడు.. ఆ మొత్తాన్ని అతడి కట్నం కింద జమ చేసుకుని తిరిగిచ్చేది లేదంటూ తెగేసి చెప్పినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతడిపై ఎంతో ఒత్తిడి తెచ్చాక రూ. 19 లక్షలను తిరిగిచ్చేశాడని, మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని చెప్పింది.


కేవలం భర్తపైనే కాకుండా.. తన మామపైనా ఫిర్యాదు చేసింది. కాగా.. ఆమె మామ(73) మాత్రం స్థానిక కోర్టును నుంచి ముందస్తు బెయిలు పొందాడు. అంతేకాకుండా.. కోడలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. భర్త తనకు విడాకులు ఇచ్చేలా అతడిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆమె ఇలా కేసు పెట్టిందని మామ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-10-26T00:34:10+05:30 IST