విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు

ABN , First Publish Date - 2021-06-24T06:59:11+05:30 IST

రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్‌మోహనరెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు
శ్రీద్వారకాధీశ గ్రంథావిష్కరణ

గుడివాడ, జూన్‌ 23 : రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్‌మోహనరెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై నందివాడ మండల వైసీపీ అధ్యక్షుడు పెయ్యల ఆదాం బుధవారం మంత్రి కొడాలి నానిని కలిశారు. అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల ఇంటర్వ్యూల సమాచారాన్ని ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  మంత్రి కొడాలి నాని స్పందిస్తూ గుడివాడ నియోజకవర్గంలో రెండు అంగన్‌వాడీ టీచర్‌, 12 అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఈనెల 16న గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయని చెప్పారు. దీనికి 76 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రా ల్లో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించ లేదన్నారు.  ఒక్క సెంటరు కూడా మూసివేయలేదని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసు కుంటూ సీఎం జగన్‌ విద్యా విధానంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు.  నాణ్యమైన విద్య,  మౌలిక సదు పాయాల కల్పన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.  

 శ్రీద్వారకాధీశ గ్రంథావిష్కరణ

శేఽషాద్రి కొండపై శ్రీనివాసుడు కొలువుదీరినసుదర్శన క్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పసిద్ధి చెందిం దని, ఈ ఆలయంపై శ్రీద్వారకాధీశ నమో నమః గ్రంఽథాన్ని రచించడం అభినందనీయమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  ప్రముఖ వ్యాపారవేత్త మాటూరి రంగనాథ్‌ రచించిన శ్రీద్వారకాదీశ గ్రంథాన్ని  ఆయన  ఆవిష్క రించారు.  రంగనాథ్‌ సంకల్పాన్ని అభినందించారు.  ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి వైశిష్ట్యాన్నిభక్తులకు తెలియజేయడానికి గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చానని చెప్పారు.  దత్త దేవాలయాలు, వేద పాఠశాల, డిగ్రీ కళాశాల, గోశాలతో పాటు ఆలయంలో నిత్యం జరిగే క్రతువులు, అన్నదానం వంటి విషయాలు పొందుపర్చానని రంగనాథ్‌ వివరించారు. తన సతీమణి శ్రీవల్లిని బోర్డు సభ్యురాలిగా నియమించిన మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావులకు రుణపడి ఉంటానని చెప్పారు. 

Updated Date - 2021-06-24T06:59:11+05:30 IST